Zero Gravity Places on Earth

భూమిపై గ్రావిటీ లేని ప్లేసెస్ కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా..!

ఈ ప్రపంచం మొత్తం ఎన్నో అధ్భుతాలతో, మరెన్నో రహస్యాలతో నిండి ఉంది. విచిత్రమేమిటంటే, వింతలున్నచోటే విచిత్రాలు కూడా ఉన్నాయి. భూమిపై గ్రావిటీ ఉందనేది ఎంత నిజమో! అదే భూమిపై భూమిపై గ్రావిటీ లేదనేది కూడా అంతే నిజం. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ భూమిపై మనం నిలబడి ఉంటున్నాం అంటే దానికి కారణం గ్రావిటీనే! అయితే, ఆ గ్రావిటీ పనిచేయకుండా జీరో గ్రావిటీ ఉన్న ప్రదేశాలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రదేశాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. మరి అలాంటి జీరో గ్రావిటీ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి? ఆ ప్లేసెస్ లో ప్రజలు ఎలా సర్వైవ్ అవుతారు? ఇలాంటి విషయాలని గురించి తెలుసుకోవాలంటే, భూమిపై ఉన్న ఈ  5 ప్లేసెస్ గురించి మీకు తెలియాల్సిందే! అవేంటో చూద్దామా మరి. 

మిస్టరీ స్పాట్ (శాంటా క్రజ్) (కాలిఫోర్నియా):

మిస్టరీ స్పాట్ అనేది అమెరికాలోని కాలిఫోర్నియాలో శాంటా క్రజ్ వెలుపల రెడ్‌వుడ్ ఫారెస్ట్ లో ఉన్న ఒక గ్రావిటేషనల్ ఎనామలీ. ఇది 150 చదరపు అడుగులు కలిగిన ఒక సర్కులర్ ఏరియా. ఈ ప్రాంతం 1939వ సంవత్సరంలో కనుగొనబడింది. మొదటినుడీ ఈ ప్రదేశంలో ఏదో ఒక మిస్టీరియస్ పవర్ దాగి ఉన్నట్లు ఎక్స్ ప్లోరర్స్  భావిస్తూ వచ్చారు. చివరికి దానిని డీప్ గా  రీసర్చ్ చేసినప్పుడు, ఈ ఏరియాలో గ్రావిటీ పవర్  పనిచేయదని తేలింది. ఇక్కడ ఒక వ్యక్తి ఏ కోణంలోనుంచి అయినా  పడిపోకుండా నిలబడగలడు. అంతేకాదు, ఇక్కడ నీరు దిగువ నుండి పైకి ప్రవహిస్తుంది. అందుకే ఈ స్థలం మిస్టీరియస్ ప్లేస్ అయింది. ఇక ప్రపంచం నలుమూలలనుండీ టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు.  

సెయింట్ ఇగ్నాస్ మిస్టరీ స్పాట్ (మిచిగాన్):

సెయింట్ ఇగ్నాస్ మిస్టరీ స్పాట్ అనేది అమెరికాలోని మిచిగాన్‌లో ఉన్న ఒక మిస్టీరియస్ ప్లేస్. ఇది 1950లో కనుగొనబడింది. ఈ ప్లేస్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి కొంతమంది టీమ్ ఇక్కడికి  వచ్చినప్పుడు, వాళ్ళ ఎక్విప్ మెంట్స్ అన్నీ పనిచేయటం మానేశాయి. దానివల్ల వాళ్లకి అర్ధమైంది ఏంటంటే, ఈ 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రావిటీ పవర్  పనిచేయదని. అందుకే, ఈ స్థలంలో నిలబడితే, ఒక స్పేస్ షిప్ లో ఉన్నట్లుగా అనిపిస్తుంది.

కాస్మోస్ మిస్టరీ స్పాట్ (డకోటా) (అమెరికా):

కాస్మోస్ మిస్టరీ స్పాట్ అనేది అమెరికాలోని దక్షిణ డకోటాలో ఉన్న ఒక రహశ్యమైన స్థలం. ఇది 1952లో కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో కనుగొనబడింది. ఈ ప్రదేశం ప్రపంచానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వింతైన చెట్లు ఇక్కడ కనిపిస్తాయి, అలాగే ఇవి ఒక వైపుకి వింతగా వంగి ఉంటాయి. ఇక్కడ, ఉండే జీరో గ్రావిటీ వల్ల, మీరు కేవలం ఒక కాలు మీదే నిలబడవచ్చు. మీ అపోజిట్ డైరెక్షన్ లో ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఇది అన్నింటికన్నా అసాధారణమైన లక్షణం. అలాగే, ఇది మీరు ఎప్పటికీ మరచిపోలేని ఫిజికల్ ఎక్స్ పీరియన్స్ కూడా. ఇక ఈ ప్రదేశానికి రావడం ద్వారా, మీరు వెయిట్ లాస్ అయినట్లు ఫీల్ అవుతారు. 

స్పూక్ హిల్ (ఫ్లోరిడా):

స్పూక్ హిల్ అనేది అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఒక గ్రావిటీ హిల్. సాధారణంగా, ఇక్కడ రైళ్లు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒకపక్కకి వాలుతూ  నడుస్తాయి. అలాగే, ఈ స్థలంలో మీరు మీ కారును ఆపి, దానిని పార్క్ చేస్తే, దానంతట అదే వాలు యొక్క వ్యతిరేక దిశలోకి లాగబడుతుంది. అంటే ఇక్కడ గ్రావిటీ పవర్ పనిచేయకపోవడమే దీనికి కారణం. ఇదంతా లేక్ వేల్స్ లోని స్పూకీ కొండపై కార్ల విషయంలో కనిపించే ఒక ఆప్టికల్ ఇల్యూజన్. 

మాగ్నెటిక్ హిల్ (లేహ్) (లడఖ్):

మాగ్నెటిక్ హిల్ అనేది లడఖ్ లోని లేహ్  సమీపంలో ఉన్న సైక్లోప్స్ హిల్. ఈ ప్రదేశం కూడా స్పూక్ హిల్ వంటిదే! ఇక్కడ కూడా వెహికల్స్ అన్నీ గంటకి 20 కిలోమీటర్ల స్పీడ్ తో ఎటువంటి సపోర్ట్ లేకుండా వాటంతట అవే కదులుతాయి. ఇక్కడ డౌన్ హిల్ రోడ్ లో ఉండే వాలు, అప్ హిల్ రోడ్ లో కూడా కనిపిస్తుంటుంది. గ్రావిటీ హిల్ అని పిలవబడే ఈ కొండ మొత్తం ఒక ఆప్టికల్ ఇల్యూజన్. అందుకే దీనిని మాగ్నెటిక్ హిల్ అని పిలుస్తారు.

So, విన్నారుకదా! జీరో గ్రావిటీ అనేది స్పేస్ లోనే కాదు, మన భూమిపై కూడా ఉంది. మరి అలాంటి ప్లేసెస్ గురించి మీకు తెలిస్తే, కామెంట్ రూపంలో నాకు తప్పక తెలియచేస్తారు కదా ఫ్రెండ్స్!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top