Gamblers Attacked the SI Who Went Riding

రైడింగ్ కి వెళ్ళిన ఎస్‌ఐని పేకాట రాయుళ్లు ఏం చేశారో తెలిస్తే నవ్వాపుకోలేరు (వీడియో)

డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న వారిని టార్గెట్ చేసి రైడింగ్ కి వెళ్ళిన ఎస్‌ఐ కి ఎదురైన అనుభవం మరే పోలీసుకీ ఎదురవకూడదు. 

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 50 మందికి పైగా ఉల్లిపాయల జట్టు కార్మికులు  నగదుతో పేకాట ఆడుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ పలువురు కానిస్టేబుల్స్‌ తో సహా అక్కడికి చేరుకొని రైడింగ్ నిర్వహించారు. 

అయితే, ఈ రైడింగ్ లో నిందితుల నుండీ 74 వేల రూపాయల నగదు,  టూవీలర్‌ వాహనాలు, సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. ఇంతవరకూ బానే ఉంది.

Tiger Cub Pranks
పులి పిల్ల చేసిన ప్రాంక్ కి షాకైన తల్లి పులి (వీడియో)

సాధారణంగా ఇటువంటి సందర్భాలలో దాడులకు వెళ్ళేటప్పుడు పోలీసులు మఫ్టీలో వెళ్తారు. అందుకే, సివిల్ డ్రస్‌లోనే పోలీసులు అక్కడికి వెళ్లారు. 

దీంతో వారు ఎస్ఐపై దాడికి యత్నించారు. తాను ఎస్సై అని ఎంత మొత్తుకున్నా వినకుండా… పిడిగుద్దులు గుద్దారు. అది చాలదన్నట్లు  దొంగా… దొంగా… అంటూ కేకలు వేశారు. ఆ కేకలు విన్న స్థానికులు నిజంగానే దొంగలేమో అనుకొని పరుగులు తీశారు. దీంతో, ‘చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది’ ఆ ఎస్సైకి. 

 

మావటిని వరుస హగ్ లతో ముంచెత్తుతున్న గున్న ఏనుగు (వీడియో)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top