Kerala Trekker Rescued by Army

కొండ వాలుల్లో చిక్కుకున్న ట్రెక్కర్ సేఫ్ (వీడియో)

రెండురోజుల క్రితం కేరళకి చెందిన బాబు అనే ట్రెక్కర్ కాలుజారి కొండ చీలికల్లో ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే! మొత్తంమీద అతని కథ సుఖాంతం అయింది.

కేరళలోని పాలక్కడ్ జిల్లా మలమ్‌పుజాలో బాబు అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈనెల 7వ తేదీ కురుంబాచి అనే కొండపైకి ట్రెక్కింగ్‌కి వెళ్లాడు.  వెళ్లడం వరకూ బానే ఉంది.  ఆ తర్వాతే ఊహించని పరిణామం ఎదురైంది. 

రిటర్న్ ట్రిప్ లో బాబు కాలు స్లిప్ అయి… కొండపై నుంచి జరజరా జారి పడ్డాడు. 1000 అడుగుల కొండపై నుంచి జారి… 400 అడుగుల్లో ఉన్న కొండవాలుల్లో చిక్కుకున్నాడు. కింద చూస్త్జే 600 అడుగుల పాతాళం. ప్రాణాలు మిగులుతాయన్న గ్యారెంటీ లేదు. దీంతో అతను ఎట్టి పరిస్థితుల్లోనూ బతికే ఛాన్స్ లేదని డిసైడ్ అయ్యారు అతని ఫ్రెండ్స్. కానీ, బాబు లక్కీగా లోయలో పడలేదు. జారే సమయంలో కొండ వాలుల్లో  చిక్కుకున్నాడు. 

ఈ విషయం తెలియని అతని ఫ్రెండ్స్  ఏం చేయాలా..! అని ఆలోచిస్తున్న సమయంలో వారికి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. నేనింకా బతికే ఉన్నాను, కొండ వాలుల్లో చిక్కుకున్నాను అని మెసేజ్ పంపాడు బాబు. అంతేకాదు, తానున్న లొకేషన్ కూడా సెండ్ చేశాడు. ఒక్కసారిగా తేరుకున్న అతని స్నేహితులు వెంటనే అతడ్ని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, లాభం లేకపోయింది. 

మలమ్‌పుజా రెవిన్యూ అధికారులకి ఈ విషయం చెప్పారు. వెంటనే అలర్ట్ అయిన రెవెన్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని బాబుని కాపాడదామని ఎంత ప్రయత్నించినా వీలు పడలేదు. 

ఆ తర్వాత  స్టేట్‌ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌, నేషనల్‌ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ టీమ్స్, కోస్ట్‌గార్డ్‌, ఎయిర్‌ఫోర్స్‌ ఇలా ఎంతోమంది రంగంలో దిగారు.  ఆర్మీ హెలికాప్టర్లు అయితే ఆ ప్రాంతం చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కనీసం ఫుడ్ అయినా అందించాలని తాపత్రయ పడ్డాయి. కానీ, ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే, హెలికాప్టర్ ఏమాత్రం కొండవాలుకు టచ్ అయినా… అది మరో ప్రమాదానికి దారితీస్తుంది. 

సోమవారం మధ్యాహ్నం నుండీ మంగళవారం మధ్యాహ్నం వరకూ తనను కాపాడాలని వస్తున్న వారందరికీ  చేతులు ఊపుతూ… తాను బాగానే ఉన్నాని సంకేతాలు ఇస్తూ… సహకరించాడు. కానీ నిన్న సాయంత్రానికి బాగా నీరసించి పోయాడ్డు. తిండీ లేదు, నీళ్లులేవు. పూర్తిగా డీహైడ్రేట్ అయిపోయాడు. కనుకుతీస్తే చచ్చిపోతానేమో అన్న భయం ఒకపక్క. బతుకాలనే ఆశ మరోపక్క. ఇలా చావుకి, బతుక్కి మధ్య 40గంటలపాటు గడిపాడు. 

ఇక బాబుని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడలేం అనే నిర్ణయానికి వచ్చారంతా. సరిగ్గా ఆ సమయంలో కేరళ సీ.ఎం పినరయి విజయన్‌ రిక్వెస్ట్ మేరకు విల్లింగ్టన్ ఎయిర్‌బేస్ అధికారులు, మౌంటేనీరింగ్ టీమ్‌ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినారు. ఫలితంగా బాబు  మృత్యువును జయించి… సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top