Sun Rays Falling on God During Aruna Homa

రథసప్తమి వేళ… అరుణ హోమం జరుగుతుండగా… దేవదేవునిపై సూర్యకిరణాలు! (వీడియో)

రథసప్తమిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెల్ల తెల్లవారకముందే సూర్యనారాయణ స్వామి ఆలయాలన్నీ భక్తుల రాకతో కిక్కిరిసిపోతాయి. ప్రముఖ సూర్య దేవాలయాలైన కోణార్క్, అరసవల్లి దేవా లయాలయితే రథసప్తమి వేడుకలకు అంగరంగ వైభంగా ముస్తాబవుతాయి. ఇక గ్రామాల్లోనూ, నగరాల్లోనూ ఉండే చిన్న చిన్న ఆలయాల్లో అయితే సరేసరి.

ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణంలో ఉన్న సంజీవనగర్ రామాలయంలో ప్రతీ యేటా అరుణ హోమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా అరుణ హోమం నిర్వహిస్తున్నారు. సరిగ్గా హోమం జరుగుతున్న సమయంలో అరుణ కిరణాలు ఆ దేవదేవునిపై ప్రసరించాయి. దీంతో సూర్య భగవానుడితోపాటు, ఆ ఆలయ పరిసర ప్రాంతమంతా దేదీవ్యమానంగా వెలిగి పోయింది.

సరిగ్గా రథసప్తమివేళ ఇలా జరగటంతో భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతరం సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top