మాస్ రివేంజ్ అంటే ఇదేనేమో! (వీడియో)

సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం రకరకాల వీడియోలు నెట్ లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక వాటిలో యానిమల్స్ కి చెందిన వీడియోల గురించి అయితే చెప్పనక్కర్లేదు. అలాంటి వీడియోనే ఇప్పుడొకటి నెట్టింట తెగ వైరల్ అయింది.

కొన్నిసార్లు ఆకస్మాత్తుగా జరిగిన సంఘటనలు కెమెరాలో రికార్డ్ అవటం చూసి నవ్వాపుకోలేము. తీరా అది ఎందుకు జరిగిందో! ఎలా జరిగిందో! తెలిసాక ఏం చేయాలో అయోమయ పరిస్థితి నెలకొంటుంది. సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది.

Tiger Cub Pranks
పులి పిల్ల చేసిన ప్రాంక్ కి షాకైన తల్లి పులి (వీడియో)

ఎక్కడో! ఏమిటో! తెలియదు కానీ, ఓ పాఠశాలలో అసెంబ్లీ జరుగుతుంది. విద్యార్థులంతా వరుసగా నిల్చుని ప్రార్దన చేస్తున్నారు. ఇంతలో పక్కనే ఉన్న గోడ మీదనుండీ ఓ కొండముచ్చు పరిగెత్తుకుంటూ వెళ్లి… ప్రేయర్ లో చివర నిల్చొని ఉన్న అమ్మాయిని ఎగిరి తన్నింది. 

దీంతో ఆ అమ్మాయి పట్టుతప్పి కింద పడిపోయింది. ఆ కొండముచ్చు చేసిన దాడి చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఏం జరిగిందో తెలుసుకొని తేరుకొనే లోపే ఆ కొండముచ్చు అక్కడినుంచీ పారిపోయింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అయి కూర్చొంది. 

మావటిని వరుస హగ్ లతో ముంచెత్తుతున్న గున్న ఏనుగు (వీడియో)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top