కొద్దిపాటి చలికే మనం గజగజ వణికి పోతుంటాం. ఇక టెంపరేచర్ మైనస్ డిగ్రీలకి చేరితే అస్సలు తట్టుకోలేం. అలాంటిది ఇక -50 డిగ్రీలకి చేరితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఊహకే అందట్లేదు కదూ!
భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో శీతాకాలం ప్రారంభమైంది. అయితే రష్యా, మరియు అమెరికా విషయానికొస్తే, భారత్ తో పోల్చుకుంటే ఇక్కడ చలి చాలా ఎక్కువ. డిసెంబర్ నెలలో ఈ దేశాల్లో ఉష్ణోగ్రతలు -0 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతాయి. ఈ క్రమంలో గడ్డ కట్టే చలి అక్కడ ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అందులో ఒక వ్యక్తి నోరు, ముక్కు, చెవులు అన్నీ కూడా చలికి గడ్డకట్టిపోవటం కనిపించింది. అతని చెవులు, మరియు కనురెప్పలు అయితే పూర్తిగా మంచుగడ్డలా మారిపోయాయి. అయితే, ఈ దృశ్యం ఎప్పటిది అనేది మాత్రం ఖచ్చితంగా తెలియలేదు. ఇక వివరాల్లోకి వెళితే…
రష్యాలోని యాకుట్స్క్ నగరానికి చెందిన ఓ వ్యక్తి -50 డిగ్రీల గడ్డకట్టే చలిలో కారులో కూర్చొని ఉండటం కనిపించింది. అతని ముఖం మొత్తం స్నోతో కవర్ అయిపొయింది. దాంతో అతను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. అతని కనురెప్పలపై కూడా స్నో ఫాల్ అవుతుంది. అలాగే అతని ముఖంమీద మంచు పొరలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ వీడియోని Xలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. దీన్నిబట్టే ఇక్కడి ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ముగింపు
ఈ సీజన్లో చలి కారణంగా ప్రజలు ఎంతో అవస్థలు పడుతుంటారు. అందుకే పూర్తి ప్రిపరేషన్ లేకుండా ఎవరూ బయటకు వెళ్ళకూడదు. గడ్డకట్టే చలిలో పొరపాటున బయటికి వెళితే ఎలా ఉంటుందో తెలిపే సాక్షమే ఈ ఆర్టికల్.