తరచూ పిల్లలు చదువుపై ఆసక్తి చూపించలేక పోతున్నారంటే, ఆ ఇంట్లో వారికి అనుకూలమైన వాతావరణం లేదని అర్ధం. ఈమధ్య కాలంలో తల్లిదండ్రులు ఈ విషయమై తెగ ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఏ ఇంట్లో అయినా పాజిటివ్ ఎనర్జీని అందించేది పిల్లల గది ఒక్కటే! అలాంటి పిల్లల గదిలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే, వాళ్ళు ఒత్తిడికి లోనవుతారు. దీంతో చదువుపై దృష్టి కేంద్రీకరించలేకపోతారు. అలా కాకుండా ఉండాలంటే, ఈ సింపుల్ టిప్స్ పాటించండి. అవి వారి కెరీర్‌ను ప్రభావవంతంగా మారుస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
స్టడీ టేబుల్:
పిల్లల గదిలో మేజర్ రోల్ ప్లే చేసేది వారి స్టడీ టేబుల్. కాబట్టి పిల్లల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, పెరగాలంటే వారి స్టడీ టేబుల్‌ను తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచండి. అలాగే వీలైనంతవరకూ చతురస్రాకారంలోనో, లేదా దీర్ఘచతురస్రాకారంలోనో ఉండే స్టడీ టేబుల్‌ని కొనుగోలు చేయండి. ఇంకా టేబుల్ రంగు కూడా పిల్లల ఏకాగ్రతను కూడా ప్రభావితం చేస్తుంది, కాబట్టి లైట్ కలర్స్ మాత్రమే తీసుకోండి.
గ్లోబ్ ఉంచండి:
పిల్లల గదిలో గ్లోబును ఉంచడం ఒక బెటర్ ఆప్షన్. అయితే, ఆ గ్లోబ్ ని వారి గదిలో ఈశాన్య దిశలో ఉంచినట్లైతే చదువులో ఏకాగ్రత పెరగటంతో పాటు, మంచి మార్కులు సాధించడంలో సహాయపడుతుంది.
కొవ్వొత్తి వెలిగించండి:
పిల్లల గదుల్లో కొవ్వొత్తి వెలిగించడం వల్ల వారి దృష్టి చదువు వైపు ఆకర్షిస్తుందని అంటారు. అయితే ఆ కొవ్వొత్తిని గదిలో తూర్పు, ఈశాన్య, లేదా దక్షిణ దిక్కులో ఉంచండి, అది వారి మెమరీ పవర్ ని పెంచుతుంది.
గది నిర్మాణం:
కొత్త ఇంటిని నిర్మించేటప్పుడు పిల్లల గది ఈశాన్య దిశలో ఉండేలా నిర్మించండి. ఈ దిశ మేధస్సుకి, శక్తికి సంబంధించింది కాబట్టి పిల్లల గదిని కూడా ఈ దిశలోనే ఉంచాలి. అది వారిలో పాజిటివ్ ఎనర్జీని కలిగించి, చదువుపై ఆసక్తిని పెంచుతుంది.
లేత రంగు:
పిల్లల చదువుకునే గదులకు ఎప్పుడూ లేత రంగులు మాత్రమే వేయాలి. ముదురు రంగులు పిల్లల దృష్టిని మరల్చుతాయి. అందుకే లేత రంగులు మాత్రమే ఉండాలి. అవి వారిని లక్ష్యంపై మనస్సు కేంద్రీకరించేలా చేస్తాయి.
పైన చెప్పిన టిప్స్ పాటించినట్లైతే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు మీ చేతుల్లోనే.