మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ కే.ఎస్.రవీంద్ర డైరెక్షన్ లో రాబోతున్న క్రేజీ అప్డేట్ వాల్తేర్ వీరయ్య. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్డేట్ ఈ రోజు రిలీజైంది.
మెగా154 వర్కింగ్ టైటిల్ పేరుతో ఈ మూవీ టైటిల్ టీజర్ ని దీపావళి కానుకగా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇందులో చిరు లుంగీ కట్టుకుని, చేతికి కడియం, వేళ్ళకి ఉంగరాలు, చెవి పోగుతో, బీడి తాగుతూ ఊరమాస్ గెటప్‌లో కనిపించారు. అంతేకాదు, ‘ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ధమాకాలు ఇంకా చూడాలంటే,.. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ అని చిరంజీవి చెప్పిన డైలాగ్ తో ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపు అయింది. ప్రస్తుతం ఈ టైటిల్ టీజర్ నెట్టింట్లో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, యెర్నేనీ రవిశంకర్, మోహన్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.